ఎండలతో జాగ్రత్తగా ఉండాల్సిందే..

Sat,April 30, 2016 06:42 AM

be alert in summer

హైదరాబాద్ : విపరీతంగా పెరుగుతున్న ఎండల కారణంగా ఇక్కట్లు కూడా పెరుగుతున్నాయి. పలురకాల వృత్తులు చేసేవారు ఎండ వేళల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఎండ వేళలో తగు జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చు. నగరంలో 40 నుంచి 43 డిగ్రీల ఎండ నమోదవుతోంది. బయటకు వెళ్లాలంటేనే జనాలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎండల నుంచి ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి. అనే అంశంపై డాక్టర్లు పలు సూచనలు చేస్తున్నారు.

చిన్నారులు జరభద్రం..
ఎండ సమయంలో పిల్లలను ఎండలో తిరగనీయరాదు. తల్లిదండ్రులు ఎండాకాలం సమయంలో ప్రయాణం చేయాల్సి ఉంటే ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయటకు వెళ్లాలి.
-అప్పుడే పుట్టిన పిల్లలు, నెలల చిన్నారులను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మధ్యమధ్యన చన్నీళ్లతో తూడుస్తుండాలి.

-వృద్దుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వడదెబ్బ త్వరగా తగిలే అవకాశం ఉంటుంది. వీరు కొబ్బరినీళ్లు, నిమ్మకాయ నీళ్లు ఎక్కువగా తాగాలి.
-మగవారితో పోలిస్తే మహిళలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఎండలో బయటకి వెళ్లకూడదు. తప్పనిసరైతే రక్షణ చర్యలు తీసుకోవాలి.

డ్రైవర్లూ జరభద్రం...
బస్సులు, లారీలు నడిపే డ్రైవర్లు ప్రస్తుతం మండే ఎండలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలువురు డ్రైవర్లు కూడా వడదెబ్బకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎండ వేడిమి ఒకవైపు ఉంటే బస్సు, లారీలోని ఇంజిన్‌వేడి అదనంగా ఉంటుంది. ఎక్కువదూరం వాహనం నడిపే సమయంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి.

-డ్రైవర్లు ఉదయం, సాయంత్రం వేళ విధులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి.
-బస్సు పక్కన ఉండే కిటికీ ద్వారా వేడిగాలి రాకుండా దానికి తడిపిన గుడ్డ కట్టాలి. ఒకవేళ వేడికి ఆరిపోయినా మళ్లీ తడిపి కడుతుండాలి.
-రోడ్డుపైన వాహనాలు నడుపుతున్న క్రమంలో ఎక్కువగా ఎండ వేడిమి వచ్చి చెమటపోతుంటుంది. కనీసం గంటకు రెండు లీటర్ల మంచినీరు తాగాలి.కూలీలు...మరింత అప్రమత్తంగా ఉండాలి..
బస్తీలలో నివాసముండే వారు, జిల్లాల నుంచి నగరానికి వలస వచ్చిన వారు ఎక్కువ మంది కూలి పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ పనులు ఉదయం 6.30 నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలి. మధ్యాహ్న సమయంలో పనులు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వకూడదు.

-ఎండలో పని చేయటం అలవాటు లేకుండా కొత్తగా పనికెళ్లేవారిలో స్థూలకాయులు, ఎక్కువ మద్యం తాగేవాళ్లు, జ్వరం, విరేచనాలతో బాధపడుతున్నవారు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువ.
-ఎండ ఎక్కువగా తగులుతూ, గాలి అందనిచోట్ల పని చేయవద్దు. పట్టిన చెమట ఆవిరి కావటానికి వీలుండాలి.
-ఈ కూలీలు ఎక్కువ శాతం ఎండలో పని చేస్తుండటంతో వీరు కూడా వడదెబ్బకు గురవుతున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఎండలో బయటకు వెళ్లొద్దు..
మనిషి శరీరం 30 నుంచి 34 డిగ్రీల వరకు ఎండను తట్టుకుంటుంది. అంతకు మించితే శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇటీవల 43 డిగ్రీల దాకా ఎండలు నమోదవుతున్నాయి. ఎండలు ఎక్కువగా ఉండటంతో శరీరంలోని నీరు తగ్గుతుంది. చెమట రూపంలో ఎక్కువగా వెళ్తుంది. బీపీ తగ్గుతుంది. కళ్లు తిరిగినట్టు ఉండి పడిపోతారు. ఇది ఒక్కోసారి కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు. వెళ్లినా తగిన జాగ్రత్తలుపాటించాలి.
- డాక్టర్ బాలాజీ, ప్రొఫెసర్, ఫీవర్ ఆస్పత్రి

1900
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles