సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు..

Fri,October 12, 2018 09:04 PM

bathukamma celebrations in ravindra bharati held by telangana cultural department

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈనెల 9 న ప్రారంభ‌మైన బతుకమ్మ వేడుక‌లు.. 17 వరకు జరగనున్నాయి. ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో బతుకమ్మను పేర్చి తెలంగాణ ఆడపడుచులు ఆడిపాడుతారు. ఇవాళ సాయంత్రం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థినిలు బతుకమ్మ ఆడారు. ఎంతో ఉత్సాహంతో బతుకమ్మ పాటలను పాడారు. ఈ వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.

596
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS