ఢిల్లీ తెలంగాణభవన్‌లో బసవేశ్వర జయంతి వేడుకలు

Mon,May 9, 2016 01:18 PM

basaveshwara birth day celebrations in new delhi in telangana bhavan

హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న తెలంగాణభవన్‌లో ఇవాళ మహాత్మ బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్, ఆర్‌సీ శశాంక్ గోయల్ పాల్గొన్నారు. కాగా, ఇవాళ బసవేశ్వర జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

కాగా, మహాత్మా బసవేశ్వరుడు హైందవ మతాన్ని ఉద్ధరించిన ప్రముఖుల్లో ఒకరు. సమాజంలో కుల వ్యవస్థ, లింగ వివక్షతను సమూలంగా రూపుమాపేందుకు పాటుపడిన అభ్యుదయ వాది. వీరశైవం ఇతడు బోధించిన మార్గం. ఆయన రచించిన ప్రవచనాలు బసవ పురాణంగా ప్రసిద్ధి చెందాయి. బసవ రచించిన ప్రవచనాలు పరమత సహనాన్ని అలవరుస్తున్నాయి. మానవ జన్మలో చెడును ప్రేరేపించే వారికి బసవ ప్రవచనాలు చేసే హిత బోధ సన్మార్గం వైపునకు నడిపిస్తాయి. జన చేతనానికి దారి తీసే వచనాలు బోధించిన బసవడి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది తొలిసారి అధికారింగా నిర్వహిస్తోంది.

1158
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles