బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్యలో వెలుగులోకి మరో కోణం

Sun,July 22, 2018 07:35 PM

bank assistant manager Murdered his wife and suicide

అంబర్‌పేట: రెండు విభిన్నమైన కుటుంబాలకు చెందిన ఇద్దరు స్త్రీ పురుషులు మనసులను ఒక్కటి చేసే బంధం పెళ్లి... ఈ పవిత్ర బందం సాక్షిగా ఆ ఇద్దరూ జీవితాంతం కలసి అన్యోన్యంగా ముందుకు సాగుతారు.. ఈ సుధీర్ఘ ప్రయాణంలో ఒక్కోసారి చిన్న చిన్న గొడవలు, అలకలు సహజం. అందులోనూ అప్పడే పళ్లైన దంపతులైతే ఒకరిపై ఒకరికి సంపూర్ణ అవగాహన ఏర్పడే వరకు చిన్న చిన్న విభేదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి.. నచ్చని పని చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది... కానీ ఆకోపం తగ్గించుకొని అర్థమయ్యేటట్టు దేని గురించి అయినా వివరించగలిగితే ఆ బంధం గట్టి పడుతుంది.

లేదంటే ఆ బంధాన్ని అనుమానమనే పెను భూతం చిథ్రమవుతుంది.. మనిషి అన్నాక చిన్న చిన్న తప్పులు చేయడం సహజం.. ఇందుకు క్షమించడం ఓ గొప్ప లక్షణం... భార్యా భర్తల్లో ఎవరైనా తమ తప్పు తెలుసుకొని క్షమాపణ కోరితే బెట్టు చేయకుండా ఒప్పుకోవాలి.. క్షమించి వారిని దగ్గరికి తీసుకోవాలి. మరో ముఖ్యమైన విషమేమిటంటే ఒకరు కోపంగా ఉన్నప్పుడు మరొకరు కూడా కోపంతో రగిలిపోవడం పద్దతి కాదు. మౌనంగా ఉండటం లేదా ఓర్పు వహించడం ముఖ్యం.. దీంతో ఇద్దరి మధ్య మరో సారి గొడవలు రాకుండా ఉండటంతో పాటు ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వం ఇద్దరిలోనూ పెరిగి అన్యోన్యమైన జీవనానికి నాందిపలుకుంది.. లేదంటే నా మాటే నెగ్గాలంటూ ఒకరికొకకు అదే పందాలో పోతే నిత్యం చిన్న చిన్న గొడవలు కాస్త చిలికి చిలికి గాలివానలో మారి క్షణకావేశంలో చివరకు ప్రాణాలు తీయడంతో పాటు ప్రాణాలు తీసుకోవడం వరకు వెళ్తుంది. దీంతో ఇరువురి కుటుంబాల్లో తీరని శోకమే మిగులుతోంది. దీనికి గత శనివారం హైదరాబాద్ నల్లకుంటలో భార్యను చంపి తానూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఓ బ్యాంకు ఉద్యోగి ఉదంతం నిలువుటద్దం పడుతోంది...

నల్లకుంట ఇన్‌స్పెక్టర్ వి.యాదగిరి రెడ్డి, బాధిత మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా కేతేపల్లి గ్రామానికి చెందిన బి.సరవయ్య, లింగమమ్మ దంపతుల కూతురు సుమలత (25)ను అదే జిల్లా మిర్యాలగూకు చెందిన మలియాద్రి కుమారుడు మేకల మాధవ్(30) కి ఇచ్చి 2017 సంవత్సరం అక్టోబర్ నెల 6వ తేదీన ఘనంగా వివాహం చేశారు. వివాహ సమయంలో రూ.6లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలను కట్నంగా ఇచ్చారు. మాధవ్ సిండికేట్ బ్యాంకు హైదరాబాద్ నల్లకుంట శాఖలో అసిస్టెంట్ మేనేజన్‌గా విధులు నిర్వహిస్తూ తన భార్య సుమలతతో కలసి నల్లకుంట శంకర్‌మఠ్ సమీపంలోని అరోవిల్లా అపార్ట్‌మెంట్‌లో మూడవ అంతస్తులో అద్దెకు ఉంటున్నాడు.. కాగా వీరి పెళ్లి అయినప్పటి నుంచి రోజూ చిన్ని చిన్న గొడవలు నిత్యకృత్యంగా మారాయి.

దీంతో గత కొన్ని నెలల క్రితం ఇరు కుటుంబాలతో పాటు పెద్దలు సర్ధిచెప్పి పంపించారు. వీరి పెళ్లి అయిన రెండు నెలలకే సుమలత నెలతప్పింది. వైద్యుల సూచనల మేరకు మెట్లు ఎక్కవద్దని చెప్పడంతో గత ఐదు నెలల నుంచి ఆమె తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది.. కాగా గత వారం అత్తగారింటికి వెళ్లిన మాధవ్ తన భార్యను తనతో పంచించాలని గొవడుకు దిగాడు.. దీంతో కూతరు సుమలతను తీసుకొని అమె తలి లింగమమ్మకూడా గత మంగళవారం నల్లకుంటలోని మాధవ్ ఇంటికి వచ్చి రెండు రోజుల పాటు ఇంట్లో ఉండి అల్లుడి సర్ధి చెప్పి గత గురువారం అమె తిరిగి వెళ్లింది...అప్పటి నుంచి ఇంట్లో ఇద్దరు దంపతుల మధ్య గొడవలు మళ్లీ మొదలయ్యాయి.

కాగా గత శనివారం మధ్యాహ్నం విద్యానగర్-జామేఉస్మానియా రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటీస్ రైలు కింద పడి మాధవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ సమాచారం కాచిగూడ రైల్వే పోలీసులు మాధవ్ తండ్రి మలయాద్రకి ఫోన్ ద్వారా తెలిపారు. ఈ వార్తను ఆయన మాధవ్ అత్తకు తెలపడంతో శనివారం రాత్రి బంధువులతో పాటు వచ్చిన సుమలత కుటుంబసభ్యులు మాధవ్ ఇంటకి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. అనుమానంతో నల్లకుంట పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా గదిలో సుమలత నిర్జీవంగా పడివుంది. ఆమె గొంతును చీరతో ఉరి వేసినట్లు అనవాళ్లు లభించాయి.. సుమలత మృత దేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలిచిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

7090
Follow us on : Facebook | Twitter
Tags
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS