గద్వాల కోటలో అత్తకు చెక్ పెట్టిన అల్లుడు

Tue,December 11, 2018 03:56 PM

Bandla Krishna Mohan reddy wins from Gadwal

హైదరాబాద్ : గద్వాల నియోజకవర్గంలో సొంత మేనత్తపై మేనల్లుడు ఘన విజయం సాధించారు. ఈ విజయంతో అత్తకు అల్లుడు చెక్ పెట్టారు. వరుసగా నాలుగోసారి అసెంబ్లీకి వెళ్లాలనుకున్న డీకే అరుణకు భంగపాటు తప్పలేదు. ఆమె అల్లుడు, టీఆర్‌ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి 26వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. కృష్ణమోహన్ రెడ్డికి మంత్రి హరీశ్ రావు అండగా నిలుస్తూ వచ్చారు. ఆయన గెలుపు కోసం హరీశ్ రావు కృషి చేశారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో డీకే అరుణ గెలుపొందిన సంగతి తెలిసిందే. రూ. 552 కోట్లతో 33 వేల ఎకరాలకు సాగునీరు అందించే గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపనం చేయడం, జిల్లా ఆస్పత్రి, బస్టాండ్, జూరాల వద్ద ఉద్యానవనం, గురుకుల పాఠశాలల అభివృద్ధి పనులకు కేసీఆర్ హామీలు ఇవ్వడమే కాకుండా జీవోలు జారీ చేయడంతో అక్కడి ప్రజలకు టీఆర్‌ఎస్ పార్టీపై నమ్మకం పెరిగింది. ముఖ్యంగా గట్టు ఎత్తిపోతల పథకంతో రైతులు టీఆర్‌ఎస్ పార్టీకి అండగా నిలిచారు.

7904
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles