జీవితంలో తొలిసారి ఓటేసిన గద్దర్

Fri,December 7, 2018 12:58 PM

Balladeer Gaddar voted for first time in his life

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో ఓ వింత చోటు చేసుకుంది. తన జీవితంలో తొలిసారి ఓటు వేశారు ప్రజా గాయకుడు గద్దర్. తన సతీమణితో కలిసి ఆల్వాల్‌లోని వెంకటాపురంలో గద్దర్ ఓటు వేశారు. ఓటు వేయడానికి వచ్చిన సమయంలో గద్దర్ చేతిలో అంబేద్కర్ ఫొటో ఉండటం విశేషం. 70 ఏళ్ల గద్దర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓటు వేయలేదు. గతంలో భువనగిరిలో బ్యాంక్ ఉద్యోగిగా చేసే సమయంలో మావోయిస్ట్ పార్టీలో చేరిన గద్దర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తన ఓటు హక్కును ఎప్పుడూ వినియోగించుకోలేదు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ఆయన ప్రజా కూటమి తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

4663
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles