17 లక్షల 60 వేలు పలికిన బాలాపూర్ లడ్డూ..

Thu,September 12, 2019 10:42 AM

Balapur Laddu auction is 17 lakhs 60 thousand

హైదరాబాద్ : బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. గత రికార్డును బాలాపూర్ లడ్డూ ప్రసాదం వేలం మించింది. ఇవాళ ఉదయం బాలాపూర్ కూడలిలో జరిగిన వేలం పాటలో రూ. 17 లక్షల 60 వేలకు కొలను రాంరెడ్డి.. బాలాపూర్ గణేషుడి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా లింగాల కొలను రాంరెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు. తొలిసారి బాలాపూర్ గణేషుడి లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు కొలను రాంరెడ్డి. గతేడాది ఈ లడ్డూ రూ. 16.60 లక్షలకు శ్రీనివాస్ గుప్తా అనే వ్యక్తి దక్కించుకున్నాడు. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ వేలం పాటలో మొత్తం 19 మంది పాల్గొన్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన భక్తులు కూడా ఉన్నారు.

1980లో మొదలై..
1980 నుంచి బాలాపూర్ వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు. 1994లో వేలంపాట పెట్టగా రూ.450 పలికింది. 2019 నాటికి అది రూ.17.60 లక్షలకు చేరింది. క్రమంగా లడ్డూ వేలంలో విలువ పెరుగుతూ వస్తుందే కానీ తగ్గిన దాఖలాలు లేవు. వేలంపాటను ఉత్సవ కమిటీ చేపడుతుంది. పోటీదారులు ఎంతమంది పాల్గొంటారో వారి జాబితా తయారుచేసి వేలం ప్రారంభిస్తారు.

3007
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles