యంత్రాల తయారీ @ బాలానగర్

Sat,February 10, 2018 06:57 AM

Balanagar as a Central point for micro and small industries

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరం సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ పరిశ్రమలపై ఆధారపడకుండ కార్పొరేట్ సంస్థలు మనుగడ సాధించలేవనడంలో అతిశయోక్తిలేదు. ఈ నేపథ్యంలోనే పారిశ్రామికరంగ అభివృద్ధి కోసం విద్యుత్, రవాణా రంగాలలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. నగరంలో ఎన్నో పేరొందిన ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు రంగ పరిశ్రమలు ఉన్నా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు విశేష ఆదరణ లభిస్తున్నది. తాగునీటి బాటిల్స్ తయారీ పరిశ్రమ, ఫార్మా పరిశ్రమలు, వాటికి కావాల్సిన పరికరాలు, మిషనరీలు తయారు చేసే పరిశ్రమలు, జ్యూస్ తయారీకి ఉపయోగించే బాటిల్స్ తయారీ పరిశ్రమల ఏర్పాటయ్యాయి. లిక్కర్ కంపనీలలో బాటిళ్ళను శుభ్రం చేయడం, లిక్కర్‌ను బాటిళ్ళలో నింపడం, మూతలు వేయడం, సీల్ చేయడం, లేబుల్స్ అతికించడం లాంటి ఆటోమేటిక్ మిషన్లు తయారు చేయడంలో నగరం ప్రత్యేక గుర్తింపు పొందుతున్నది.
సత్తా చాటుతున్నాయి..
వృత్తి నైపుణ్యం ఉన్న యూనిట్లు మనుగడ సాధిస్తున్నాయి. ఐడీఏ బాలనగర్, జీడిమెట్ల, చర్లపల్లి, బండ్లగూడ, మౌలాలి, సనత్‌నగర్, కుషాయిగూడ తదితర చోట్ల ఇలాంటివి పెద్దసంఖ్యలో ఉన్నాయి. ఆయా యూనిట్లు తొలుత పలు రకాల మిషన్లకు విడిభాగాలు తయారు చేయడంలో గుర్తింపు పొందాయి. కాలానుగుణంగా మారుతున్న మార్కెట్ అవసరాలను, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మిషన్‌ల తయారీపై దృష్టి సారించాయి. పలు రకాల లిక్కర్, వాటర్‌ప్లాంట్, ఫార్మా పరిశ్రమలు, శీతలపానీయాలు, జ్యూస్ తయారీ పరిశ్రమల కంపెనీలకు ఆటోమేటిక్ మిషన్లు తయారు చేసేస్థాయికి ఎదిగాయి.
దేశ విదేశాలకు యంత్రాల సరఫరా..
నగరంలో వెలుగొందుతున్న సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు విదేశాలతో పాటు దేశంలోని పలు రాష్ర్టాలకు సైతం పలు యంత్రాలను తయారు చేయడంలో సత్తాచాటుతున్నాయి. అంతేగాక విదేశాలకు సైతం ఆర్డర్‌పై యంత్రాలను తయారుచేసి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాయి. పలు యూనిట్లు ఏడాదికి రూ. 50లక్షల నుంచి రూ. 10 కోట్ల వరకు వ్యాపార లావాదేవీలను కొనసాగిస్తున్నాయి. వీటి ద్వారా నగరంలో వేలాది మంది నిరుద్యోగులు ఉపాధి అవకాశాలను పొందుతున్నారు.

1388
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles