తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ: సిధారెడ్డి

Sun,October 21, 2018 09:32 PM

balakumar symbol of telangana culture nandini sidda reddy

మహబూబ్‌నగర్ : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తుందని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వాగ్దేవి కళాశాలలో నిర్వహించిన సాహిత్య పరిషత్, తెలుగు సాహిత్య పీఠం, తెలుగు కవితా వైభవం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పద్య రచనా శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి, రచయిత డాక్టర్ బీంపల్లి శ్రీకాంత్ రచించిన బతుకమ్మ నానీలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక బతుకమ్మ పండుగకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. బతుకమ్మ నానీలను రచించిన రచయిత భీంపల్లి శ్రీకాంత్‌ను అభినందించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వరెడ్డి, డాక్టర్ పొద్దుటూరి ఎల్లారెడ్డి, డాక్టర్ నలవోలు నరసింహారెడ్డి, మేక రవీంద్ర, రావూరి వనజ పాల్గొన్నారు.

1278
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles