ఉప్పల్ భగాయత్ లే అవుట్‌పై సదస్సు

Sun,March 24, 2019 07:35 AM

Awareness programme on Uppal Bhagayat layouts

హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఉప్పల్ భగాయత్ లేఅవుట్‌లోని ప్లాట్ల ఈ-వేలంపై కొనుగోలుదారులకు అవగాహన కల్పించేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు సోమవారం ప్రీ-బిడ్ అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్లు హెచ్‌ఎండీఏ కార్యదర్శి ఎం.రాంకిషన్ తెలిపారు. హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్ రెండో విడుత ప్లాట్ల అమ్మకానికి వచ్చే నెల 7, 8 తేదీల్లో ఈ-వేలం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నామన్నారు. బహుళ ప్రయోజన భవనాలను నిర్మించేందుకు వీలుగా సదరు లేఅవుట్‌ను మల్టీజోన్‌గా ప్రకటించామన్నారు. 30 మీటర్ల వెడల్పుతో రోడ్ల నిర్మాణంతో పాటు అన్ని వసతులతో మెట్రోస్టేషన్‌కు అతి చేరువలో ఉన్న ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామని చెప్పారు. ఈ-వేలంలో పాల్గొనేవారి కోసం ప్రీ-బిడ్ అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 25న ఉదయం 11 గంటలకు తార్నాకలోని హెచ్‌ఎండీఏ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసే సమావేశంలో కొనుగోలుదారులు తమ పేరును ఎలా నమోదు చేసుకోవాలి?, ఎలా వేలంలో ధరను బిడ్ చేయాలి? వంటి సాంకేతిక అంశాలతో కూడిన సమాచారాన్ని అధికారులు అవగాహన కల్పిస్తారని వివరించారు. వివరాలకు గంగాధర్ ఎస్టేట్ అధికారి 9491739490, ఎం.సరస్వతి డీఏవో 9989336908 నంబర్లలో సంప్రదించాలన్నారు.

896
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles