హెల్మెట్‌పై వినూత్నంగా అవగాహన.. యుముడు, చిత్రగుప్తుడి వేషధారణతో ప్రచారం

Mon,February 4, 2019 08:28 PM

awareness program on helmet wearing in mancherial dist

మంచిర్యాల ఆర్టీఏ అధికారుల సరికొత్త ప్లాన్
హెల్మెట్ ధరించిన వారికి పూలు అందజేత
ధరించని వారికి ఇబ్బందులు తప్పవని హెచ్చరిక

మంచిర్యాల: రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంచిర్యాల రవాణా శాఖ అధికారులు కళాకారులతో కలిసి హెల్మెట్ వాడకంపై వాహనదారులకు వినూత్నంగా అవగాహన కల్పించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో యుముడు, చిత్రగుప్తుడి వేషధారణతో ప్రతీ వాహనదారుడికి హెల్మెట్ వాడకంతో ఉన్న ప్రయోజనాలను వివరించారు. హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. ప్రాణానికి రక్షణగా ఉంటుందనీ, తలకు ఎలాంటి అపాయం లేకుండా ఉంటుందని వారు పేర్కొన్నారు. హెల్మెట్ ధరించిన వారికి పూలు అందజేశారు. ధరించని వారిని యముడు పైకి తీసుకెళ్తాడని చెబుతూ అవగాహన కల్పించారు.

3694
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles