గొర్రె పిల్లల పంపిణీపై అవగాహన సదస్సు

Mon,May 8, 2017 01:26 PM

Awareness Convention on the Distribution of Sheeps

హైదరాబాద్ : గొల్లకురుమల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. రాష్ట్రంలోని గొల్లకురుమ కుటుంబాలకు గొర్రె పిల్లలను ఉచితంగా పంపిణీ చేయాలని సంకల్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ పథకంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా సోమవారం సిద్ధిపేటలో నిర్వహించిన గొర్రెల పంపిణీ అవగాహన సదస్సులో మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. హరీష్‌రావు మాట్లాడుతూ.. గొల్లకురుమలకు మేలు చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. సిద్ధిపేట జిల్లాలో 21 వేల గొల్లకురుమ కుటుంబాలున్నాయని చెప్పారు. 15,862 మంది మాత్రమే సొసైటీల్లో సభ్యత్వం తీసుకున్నారని పేర్కొన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరినీ సొసైటీల్లో సభ్యులుగా చేర్పించాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన వారిని సభ్యులుగా సొసైటీల్లో అవకాశం కల్పించాలని చెప్పారు. ఈ ఏడాది 50 శాతం మందికి.. వచ్చే ఏడాది 50 శాతం మందికి గొర్రె పిల్లల పంపిణీ జరుగుతదని తెలిపారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతదని స్పష్టం చేశారు.

781
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles