ఈ నెల 25న ఆటోలు బంద్

Wed,June 12, 2019 09:03 AM

AUTOS BANDH ON JUNE 25TH


హైదరాబాద్ ‌: రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్స్‌ దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా ఒక రోజు ఆటో బంద్‌ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ మహ్మద్‌ అమానుల్లాఖాన్‌ తెలిపారు. మంగళవారం హైదర్‌ గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఆర్టీఏ, ట్రాఫిక్‌ పోలీసులు ఆటో డ్రైవర్లపై చేసే వేధింపులను నిలిపి వేసి సం క్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పహాడి షరీఫ్‌ పీఎస్‌ పరిధి లో ఆటో కిరాయి విషయంలో తలెత్తిన వివాదంలో ఆటో డ్రైవర్‌ సాయి నాథ్‌ను అతికిరాతకంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షిం చాల న్నారు. సాయినాథ్‌ కుటుంబానికి అండగా ఉండి ఆర్థిక సహాయంను అంద జేయనున్నట్లు తెలిపారు. జేఏసీ నాయ కులు వంశీకృష్ణ, యంఏ సలీమ్‌, మహ్మద్‌ దస్తగీర్‌,మహ్మద్‌ అజీమొద్దీన్‌,మహ్మద్‌ లతీఫ్‌ పాల్గొన్నారు.

4813
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles