22 ఆగస్టు గురువారం 2019.. మీ రాశిఫలాలు

Thu,August 22, 2019 05:14 AM

August 22st, 2019 Thursday horoscopes details

మేషం

మేషం : ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావటం కానీ జరుగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టువదలక ప్రయత్నించండి. విజయం మీ సొంతమవుతుంది. పనిఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది.


వృషభం

వృషభం : ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభవార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు.


మిథునం

మిథునం : ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధమైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి.


కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మీకు ఆనందంగా, లాభ దాయకంగా ఉంటుంది. అనుకోని మితుృలను కలవటం, వారితో రోజును ఆనందంగా గడపడం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.


సింహం

సింహం : ఈ రోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగవిషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.


కన్య

కన్య : ఈ రోజు ప్రయాణం చేసే అవకాశం అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర, ఛాతి సంబంధ అనారోగ్యాల వలన ఇబ్బంది పడే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా రోజంతా ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది. మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసే అవకాశముంటుంది.


తుల

తుల : ఈ రోజు మీ సహోద్యోగులతో, పై అధికారులతో కొంత సామరస్య పూర్వకంగా ప్రవర్తించటం మంచిది. అనుకోని ఆవేశం కారణంగా వారితో గొడవ జరిగే అవకాశముంటుంది. ప్రయాణంలో అనవసరమై చిక్కుల్లో ఇరుక్కునే అవకాశముంటుంది కాబట్టి జాగ్రత్త అవసరం.


వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు మీ దాంపత్యజీవితం ఆనందమయంగా ఉంటుంది. వివాదాలు సమసిపోతాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో కానీ, శుభకార్యంలో కానీ పాల్గొంటారు. వ్యాపారస్థులు పెట్టుబడులు పెట్టడం కానీ, నూతన వ్యాపార ఒప్పందాలు ఏర్పరచుకోవటం కానీ చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.


ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వాయిదా పడుతున్న పనులు ఎలాగైనా పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉంటారు. అదే పట్టుదలతో వాటిని పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీ మాట నెగ్గుతుంది. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్‌కి సంబంధించిన పనులు ఒక కొలిక్కి వస్తాయి.


మకరం

మకరం : ఆర్థికంగా ఈ రోజు సమాన్యంగా ఉంటుంది. అందిన డబ్బు క్షణాల్లో ఖర్చవుతుంది. ఇతరుల నుంచి ఆర్థిక సహాయం పొందటం జరుగుతుంది. అలాగే మీ సంతానం కారణంగా లేదా మీ స్నేహితుల కారణంగా కొంత డబ్బు ఖర్చవుతుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. మానసికంగా కొంత ఆందోళన ఉంటుంది. ఎక్కువ డబ్బుతో బయటకు వెళ్లకండి.


కుంభం

కుంభం : ఈ రోజు పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఏ పని కూడా శ్రమలేకుండా పూర్తి కాదు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు చేయాల్సి వస్తుంది. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కోపానికి, అసహనానికి గురవకుండా ఓపికగా పనులు చేయటం మంచిది.


మీనం

మీనం : ఆర్థికంగా చాలా అనుకూలించే రోజు. ఉద్యోగంలో రావలసిన బకాయిలు రావటం కానీ, జీతం పెరగటం కాని జరుగుతుంది. ఉద్యోగ రిత్యా ప్రయాణం చేస్తారు. నూతన వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. మీ బంధువులను కలుసుకుంటారు. గతంలో చేసిన అప్పులు తీరుస్తారు.

5545
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles