స్వామిగౌడ్‌ను గాయపరచడం క్షమించరాని నేరం: అల్లం నారాయణTue,March 13, 2018 06:03 PM

స్వామిగౌడ్‌ను గాయపరచడం క్షమించరాని నేరం: అల్లం నారాయణ

హైదరాబాద్: శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌ను గాయపరచడం క్షమించరాని నేరమని రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. కాంగ్రెస్ సభ్యుల దాడిలో గాయపడి నగరంలోని సరోజనీదేవి కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వామిగౌడ్‌ను అల్లం నారాయణ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిండు సభలో మండలి ఛైర్మన్‌పై దాడి జరగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని.. ఇలాంటి ఘటనలు చట్ట సభల ప్రజాస్వామ్య విలువలను పలుచన చేస్తాయని అభిప్రాయపడ్డారు. గవర్నర్ ప్రసంగం సమయంలో దౌర్జన్యపూరిత పనులు చేయడం సబబు కాదన్నారు. గవర్నర్, స్పీకర్, మండలి ఛైర్మన్ ఉన్న సభలో సభ్యులు జాగ్రత్తగా ఉండాలన్నారు. వ్యతిరేకించడం, నిరసన తెలపడం వేరు.. దౌర్జన్యం చేయడం వేరన్నారు.

1373
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS