హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలు మూడో రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. రవీంద్రభారతిలోని యశోదారెడ్డి ప్రాంగణంలో జంట కవుల అష్టావధానం వైభవంగా కొనసాగింది. ముదిగొండ అమరనాథ శర్మ, ముత్యంపేట గౌరీశంకరశర్మల అష్టావధానం జరిగింది. జంట కవుల అష్టావధానానికి టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అష్టావధానం కార్యక్రమానికి భాషాభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. జంట కవులంటే తిరుపతి కవులే గుర్తుకు వస్తారని తెలిపారు. జంట కవుల అష్టావధానాన్ని చూడటం ఇదే తొలిసారి అని చెప్పారు. తెలుగు మహాసభల కార్యక్రమాలు ప్రపంచాన్నే ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు.