ఎంవీఐ పోస్టులకు డిప్లామా అభ్యర్ధులు కూడా అర్హులే

Fri,March 15, 2019 11:27 PM

Assistant Motor Vehicle Inspectors eligible for recruitment

హైదరాబాద్ : రవాణాశాఖకు సంబంధించి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల నియామకాల్లో కావలసిన అర్హతలు సడలింపబడ్డాయి. ఉన్న అర్హతలకు తోడు డిప్లామా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్‌ను కొత్తగా జతపరిచారు. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ జాయింట్ సెక్రటరీ ప్రియాంక భారతి పేరుతో ఈ నెల 8 న గెజిట్ విడుదల చేసింది. గతంలో బోర్డు గుర్తించిన 10వ తరగతి సర్టిఫికెట్‌తోపాటు డిప్లామా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్(త్రీ ఇయర్స్)తోపాటు మోటర్ సైకిల్ విత్ గేర్ అండ్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. అదనంగా మెకానికల్ డిప్లామా(త్రీ ఇయర్స్) కూడా చేర్చింది. ఇప్పటివరకు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులే కాకుండా మెకానికల్ ఇంజనీరింగ్ అభ్యర్ధులకు కూడా అవకాశం రానుంది.

1522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles