యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వం: సీఎం కేసీఆర్

Sun,September 15, 2019 02:46 PM

రాష్ట్రం వచ్చేనాటికి 14973 మెగావాట్ల ట్రాన్స్‌మిషన్ కెపాసిటీ ఉంటే నేడు 33,210 మెగావాట్ల ట్రాన్స్‌మీషన్ కెపాసిటీ ఉంది. విమర్శ కోసం విమర్శ చేసి అభాసుపాలు కాకండి. మే మంచిపని చేసి ఉండకపోతే, 25 సీట్లు పెరిగేవా? మెజారిటీ పెరిగేదా? యురేనియం తవ్వకాల గురించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎవ్వరికీ ఏ విధమైన అనుమతి ఇవ్వలేదని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. భవిష్యత్‌లో అనుమతి ఇచ్చే ఆలోచన కూడాలేదని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నల్లమల అడవులను నాశనం కానివ్వం. అనుమతులు ఇవ్వొద్దని చెబితే కూడా గతంలో అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనుమతులు మంజూరు చేశారు.


ఆంధ్రాలో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. రైతాంగానికి అన్నం పెట్టేటటువంటి కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టు, కింద డేల్టా కలుషితం అయ్యి నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. హైదరాబాద్‌కు తాగునీటిని కూడా తీసుకోలేని ప్రమాదం ఏర్పడుతుంది. వీటన్నింటి దృష్ట్య ఎట్టి పరిస్థితుల్లో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వమని తేల్చి చెప్పారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం దీనిపై ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రజానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఒకవేళ గట్టిగా వస్తే అందరం కలిసి కొట్లాడుదామని తేల్చి చెప్పారు. దీనిపై రేపు అసెంబ్లీలో తీర్మాణం కూడా చేసి కేంద్రానికి పంపిస్తామని తెలిపారు.

1420
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles