తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడ పోయింది: అసదుద్దీన్ ఓవైసీ

Sat,September 8, 2018 06:38 PM

asaduddin owaisi comments on Congress and TDP ties

హైదరాబాద్: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటదని.. తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడ పోయిందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు అంశంపై అసదుద్దీన్ మాట్లాడుతూ.. టీడీపీ, కాంగ్రెస్ పొత్తును ప్రజలు తిప్పికొడతారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు. తమకు పదవులపై ఎప్పుడూ ఆశ లేదన్న ఓవైసీ.. మైనార్టీలు, బలహీనవర్గాల కోసం తమ పార్టీ పాటుపడుతుందన్నారు.

ఎంతో విశ్వాసం ఉండడం వల్లే టీఆర్‌ఎస్ పదవీకాలం ఉన్నా ఎన్నికలకు సిద్ధమైంది. ఇతర రాజకీయ పార్టీలు ఒక్క రోజు కూడా పదవిని వదులుకోవన్నారు. కేసీఆర్ పాపులారిటీ చాలా ఎక్కువగా ఉంది. టీఆర్‌ఎస్, ఎంఐఎంను ఒంటరిగా ఢీకొనే దమ్ములేక పొత్తుల కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎంగా నాలుగేళ్లు ఏం చేయని చంద్రబాబు తెలంగాణకు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. పొత్తుతో కాంగ్రెస్, టీడీపీ నిండా మునుగుతాయని పేర్కొన్నారు.

8535
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles