58 గంటలు నిరంతర వీక్షణం.. ప్రతి దృశ్యం స్పష్టం..!

Mon,September 3, 2018 09:52 AM

around 58 hours continuously monitoring done by command control at sabha

- కమాండ్ కంట్రోల్‌తో మంచి ఫలితం
హైదరాబాద్: ప్రగతి నివేదన సభ సక్సెస్‌లో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ అత్యంత కీలక పాత్రను పోషించింది. 24 సెక్టార్లు, 22 పార్కింగ్ స్థలాల్లో ఏర్పాటు చేసిన దాదాపు 200 సీసీ కెమెరాలతో 58 గంటల పాటు 1600 ఎకరాల ప్రాంతంలోని ప్రతి గజాన్ని స్పష్టంగా వీక్షించి బందోబస్తును పటిష్టంగా నిర్వహించారు. దాదాపు 42 మంది సిబ్బంది నిరంతరం 15 మానిటర్‌ల ద్వారా వీక్షించిన సిబ్బంది ఏ చిన్న అనుమానం వచ్చినా అధికారులను అప్రమత్తం చేశారు. ఈ కమాండ్ కంట్రోల్‌కు సారధ్యం వహించిన రాచకొండ పోలీసు కమిషనరేట్ ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి, సిబ్బందితో కలిసి నిరంతరం పర్యవేక్షించారు. ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా తప్పిపోయిన ఓ వ్యక్తిని కూడా వారి బృందానికి అప్పగించారు. ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా సభను స్పష్టంగా తమ మొబైల్ ఫోన్‌లలో స్పష్టంగా వీక్షించే విధంగా డీజీపీ కార్యాలయంతో పాటు ఇతర కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయడంతో పరిస్థితిని డీపీజీ మహేందర్‌రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షించారు.

2520
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles