ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్య శ్రీ ఎన్నో రెట్లు మేలు..

Mon,September 9, 2019 01:35 PM

arogya sree is better more than ayushman bharat says cm kcr

హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేయగలవని భావించిన కేంద్ర పథకాలను మాత్రమే రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకం.. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ కన్నా ఎంతో విశిష్టమైనది అని సీఎం పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ కోసం ఏడాదికి రూ. 1,336 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందన్నారు. కానీ ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా రాష్ట్రంలో ఏడాదికి రూ. 250 కోట్ల విలువైన వైద్య సేవలు మాత్రమే అందుతాయి. ఆరోగ్య శ్రీ ద్వారా 85 లక్షల 34 వేల కుటుంబాలకు ప్రయోజనం కలిగితే ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే మేలు కలిగే అవకాశం ఉందన్నారు సీఎం కేసీఆర్‌. ఆరోగ్య శ్రీ ద్వారా అందే అవయవ మార్పిడి సేవలు ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా అందవు అని తెలిపారు. ఆయుష్మాన్‌ భారత్‌ కన్నా ఆరోగ్యశ్రీ పథకం ఎన్నో రెట్లు మెరుగైనది. కాబట్టి కేంద్ర పథకాన్ని మనం వద్దు అనుకున్నామని సీఎం చెప్పారు.

1190
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles