‘ఆరోగ్యలక్ష్మి’కి ఏడాది పూర్తి

Sat,January 2, 2016 10:31 AM

arogya lakshmi scheme in telangana complete one year

హైదరాబాద్ : దారిద్య్రరేఖకు దిగువలో ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందిచాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యలక్ష్మి పథకం 2015 జనవరి 1వ తేదీ నాటి అమలులోకి వచ్చింది. నిన్నటికి ఇది ఏడాది పూర్తి చేసుకుంది. పథకం అమలులో భాగంగా అర్హులైన గర్భిణులకు ఇవ్వనున్న గుడ్ల సంఖ్యను 16 నుంచి 30 పెంచడంతో పాటు కడుపు నిండా భోజనం (ఒక్కపూట ఫుల్‌మీల్స్) అందిస్తున్నారు.
కిషోర బాలికలకు 16 గుడ్లను ఇవ్వడంతో పాటూ బియ్యం, కందిపప్పు, మంచినూనె, ఐఎఫ్‌ఏ (ఐరన్ ఫోలిక్ ఆసిడ్ టాబ్లెడ్స్) ఇచ్చేందుకు నిధులు విడుదల చేశారు. 6నెలల నుంచి 6ఏండ్ల వయసున్న బాలబాలికలకు 2.5కిలోల బాలామృతం (తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ సరఫరా చేసే విటమినైజ్‌డ్ స్నాక్స్)ను, ప్రతి నెల 6 నెలల నుంచి 3 ఏండ్ల వయసున్న బాలబాలికలకు 16 గుడ్లను, 3 నుంచి 6 ఏండ్ల వయసున్న వారికి 30 గుడ్లను ప్రతినెలా అందించాలని, అందుకు అవసరమైన నిధులను 2015 జనవరి 1వ తేదీ నుంచి సమకూర్చుతున్నారు. స్త్రీల ఆరోగ్యంపై విపరీత ప్రభావం చూపే రక్తహీనత సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేయడం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలోని 940 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పథకం అమలవుతోంది. అలాగే ఆరోగ్యలక్ష్మి అర్హులకు త్వరలోనే సన్నబియ్యంతో సుభోజనం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖల అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. వీటికి త్వరలోనే ఆమోదం లభించే అవకాశం ఉంది.

సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం...


ప్రభుత్వ వసతిగృహల్లో విద్యనభ్యసిస్తోన్న పేద విద్యార్థులకు కడుపునిండా పౌష్టికహరం అందజేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యంతో ఒక మంచి సంపూర్ణ ఆహారం (ఆరోగ్యలక్ష్మి) పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే ఆరోగ్యలక్ష్మి పథకంతో పాటు రాష్ట్రవాప్తంగా ఉన్న ప్రీ మెట్రిక్ సంక్షేమ హాస్టళ్లలో విద్యనభ్యసిస్తోన్న విద్యార్థులకు ప్రభుత్వం 2015 జనవరి 1వ తేదీ నుంచి సన్నబియ్యంను అందజేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలోని మొత్తం 69 (ఎస్సీ-13, బీసీ-50, వికలాంగులు-6) సంక్షేమ హాస్టళ్లలో ఈ సన్నబియ్యం పథకం అమలవుతోంది. గత పాలకుల హయాంలో ముక్కపట్టిన పురుగుల అన్నం, నీళ్లచారుతో విసుగుచెందిన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన సన్నబియ్యంతో సుభోజనం అందిస్తుండుటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

9317
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles