ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్మీ జవాను మృతి

Sat,December 1, 2018 09:09 PM

Army jawan of Khammam district killed in uttarakhand

కల్లూరు : ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామానికి చెందిన మేకల సునీల్‌బాబు ఉత్తరాఖండ్‌లో సైన్యంలో పనిచేస్తూ ఆకస్మాత్తుగా మృతిచెందాడు. ఇతని మృతదేహాం ఈ రోజు లింగాల గ్రామానికి చేరుకోగా స్థానికులు నివాళులర్పించారు. సునీల్‌బాబుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఉత్తరాఖండ్‌లో సైన్యంలో పనిచేస్తూ విధి నిర్వహణలో గురువారం మృతి చెందగా, సైనిక నిబంధనల ప్రకారం మృతదేహాన్ని లింగాలకు తరలించారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు జై జవాన్, జై జవాన్ అంటూ జోహార్లు అర్పించారు. సునీల్‌బాబు మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

2237
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles