ఆర్మూరు ఎమ్మెల్యే ఆపన్నహస్తం.. నెల జీతం విరాళం

Sun,August 19, 2018 07:39 PM

armoor mla donated his one month salary to kerala flood victims

-నెల వేతనాన్ని కేరళ రాష్ర్టానికి సాయం
-అందించిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
ఆర్మూర్: కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో జనజీవనం స్తంభించిన సంగతి తెలిసిందే. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలను తనవంతుగా ఆదుకోవడానికి ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ముందుకు వచ్చారు. కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాలని సీఎం కేసీఆర్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, మైనింగ్ శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వీరి పిలుపునకు స్పందించి నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆయన నెల వేతనాన్ని కేరళ రాష్ర్టానికి సాయం అందిస్తున్నట్లు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ లైక్‌కొట్టి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని అభినందించారు. కేరళ రాష్ట్రం భారీ వర్షాలు, వరదలతో సంభవించిన తుఫానుతో లక్షలమంది నిరాశ్రయులయ్యారని, ఉండడానికి ఇండ్లు, తినడానికి తిండి, ధరించడానికి బట్టలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజాప్రతినిధులు, నాయకులు, వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్ధల సభ్యులు ఎవరికి తోచిన విధంగా వారు కేరళ రాష్ర్టానికి సాయం అందించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

5411
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles