ఏప్రిల్ 16 మంగళవారం 2019..మీ రాశిఫలాలు

Tue,April 16, 2019 06:26 AM

April 16 TUESday 2019 yours horoscopes details

మేషం

మేషం : మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే మీప్రేమను మీరు ప్రేమించిన వ్యక్తికి చెప్పడానికి అనుకూల దినం. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని చిన్న ఆందోళన మనస్సులో ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం మంచిది.

వృషభం

వృషభం : ఈ రోజు మీ ఇంటికి సంబంధించిన పనులు చేయడానికి, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మానసికంగా కొంత ఆందోళన, చిరాకుగా ఉండటం జరుగుతుంది. చదువు పట్ల కొంత నిరాసక్తత ఉంటుంది. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.

మిథునం

మిథునం : ఈ రోజు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బంధువులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలయినప్పటికీ, అందుకు తగిన ఖర్చుపైన పడటంతో వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది. పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కారణంగా కూడా డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది.

సింహం

సింహం : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. రుచి కరమైన ఆహారం లభిస్తుంది. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు.

కన్య

కన్య : ఈ రోజు కొంత బద్దకంగా గడుపుతారు. ఏ పని చేయడానికి ముందుకురారు. దీనికి కారణంగా కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మీ మిత్రులతో కానీ, దగ్గరి బంధువులతో వివాదం జరగడం లేదా వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం జరగవచ్చు. భూ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.

తుల

తుల : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మిత్రుల నుంచి అనుకోని సాయం అందుకుంటారు. మీ స్నేహం బలపడుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకోని శుభపరిణామాలు ఏర్పడతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయడానికి అనుకూల సమయం. పైఅధికారులను కలవడానికి అలాగే ముఖ్యమైన ఒప్పందాలకు కూడా అనుకూలించే దినం. అనుకోని బహుమతులు కానీ, ప్రశంసలు పొందుతారు. మీ మిత్రులు లేదా బంధువుల సాయం అందుకుంటారు. అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు.

ధనుస్సు

ధనుస్సు :ఈ రోజు రోజువారీ పనులనుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మిక వేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనడం కానీ, ఇల్లు సర్ధటం చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.
దర్శనం చేసే అవకాశముంటుంది.

మకరం

మకరం : ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సంఘటన కారణంగా మీ మనస్సు చెదురుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయం ఈ రోజు సూచించబడ్డాయి. మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. శివుడ్ని పూజించండి.

కుంభం

కుంభం : ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవడానికి, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవడానికి అనుకూల దినం. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయడానికి అనువైన దినం. పిల్లల ఆరోగ్య విషయంగా లేదా విద్యా విషయంగా కొంత ఆందోళన చెందుతారు.

మీనం

మీనం: ఈ రోజు వివాదాలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా భూమి సంబంధ వివాదాలు పరిష్కరించుకోడానికి అనుకూల దినం. మీ మాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థిక లాభాలుంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.

8506
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles