గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్‌లో ముగ్గురు సభ్యుల నియామకం

Mon,October 14, 2019 10:09 PM

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్‌లో ప్రభుత్వం ముగ్గురు కొత్త సభ్యులను నియమించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా బండారు భాస్కర్‌, గటిక అజయ్‌కుమార్‌, పి. గోవర్ధన్‌రెడ్డి నియమించబడ్డారు. నూతన పంచాయతీరాజ్‌ చట్టం మేరకు ఇటీవల ప్రభుత్వం ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. సభ్యులుగా నియమితులైన పి. గోవర్ధన్‌ సీనియర్‌ న్యాయవాది కాగా, బండారు భాస్కర్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. గటిక అజయ్‌కుమార్‌ వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలాధ్యక్షుడిగా పనిచేశారు. గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్‌లో తమకు అవకాశం కల్పించినందుకు వారు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

1058
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles