మై నేషన్ అవుట్ లెట్ల కోసం అప్లై చేసుకోండిలా...

Sat,March 16, 2019 06:02 AM

apply for my nation outlets in telangana

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఖైదీలతో తయారు చేసిన వస్తు ఉత్పతులను విక్రయించడానికి ఉత్సాహవంతులైన వ్యాసారస్తులు, దుకాణాదారులు దరఖాస్తు చేసుకోవాలని చంచల్‌గూడ జైలు పర్యవేక్షణాధికారి కే అర్జున్‌రావు తెలిపారు. జైలు ఉత్పత్తులకు విశేష ఆదరణ ఉన్న కారణంగా వ్యాపారస్తులను ఆహ్వానిస్తునట్లు ఆయన పేర్కొన్నారు.ఔట్‌లెట్లు పెట్టుకునేవారికి పది వేల నుండి లక్ష రూపాయల వర కు వస్తువుల రూపేణ ఋణ సదుపాయం కలిపిస్తున్నామన్నారు.జైలులో తయారు చేసే గోధుమపిండి, శెనగపిండి, కారంపొడి, పసుపుపొడి, గరమ్‌మసాలా, సబ్బులు, ఫినాయిల్, నోట్‌బుక్స్, అలమారాలు, స్టీల్ ఇండస్ట్రీస్, లుంగీలు, బల్బులు తదితర 50 రకాల ఉత్పత్తులు ఔట్‌లెట్ ద్వా విక్రయించేలా అవకాశం ఉంటుందన్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని సిటీ పరిసర ప్రాంతాల్లో మండల కేంద్రాలల్లో ఔట్‌లెట్ దుకాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చున్నారు.ప్రస్తుతం ఉన్న దుకాణాదారులు ఈ ఉత్పత్తులను అమ్ముకొనవచ్చునని,వారికి ఉచితంగా రవాణా సౌకర్యం కలిపిస్తునటు ఆయన తెలిపారు.నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. సందేహలు ఉంటే జైలర్ విజయ్‌కుమార్ 9494 32047కి కాల్ చేసి సంప్రదించాలన్నారు

597
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles