స్కాలర్ షిప్ లకు దరఖాస్తుల ఆహ్వానం

Fri,October 12, 2018 07:27 PM

applications invites for scholarships in medak

మెదక్ : జిల్లాలోని మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఉపకార వేతనాల కొరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి సుధాకర్ తెలిపారు.1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు అందించే ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకోసం ఈనెల 15వ తేదీలోగా, ఇంటర్ నుంచి పీహెచ్‌డీ వరకు అన్ని కోర్సులు చదివే విద్యార్థులకు అందించే పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలకోసం ఈనెల 31వ తేదీలోగా ధరఖాస్తులను ఆన్‌లైన్‌లో www.scholarships.gov.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని మైనార్టీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

5842
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles