గురుకుల కాలేజీల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

Fri,January 18, 2019 08:26 AM

మేడ్చల్ రూరల్ : సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2019-20 ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మేడ్చల్ పట్టణంలోని కిష్టాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పద్మావతి తెలిపారు. సాధారణ ఇంటర్ తో పాటు ఐఐటీ, జేఈఈ, ఎంసెట్, క్లాట్ జూనియర్ కళాశాలల్లో పరీక్షలకు శిక్షణను అందించే కళాశాలల్లో ప్రవేశానికి కూడా ఒకేసారి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే WWW.TSWREIS.IN వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఫిబ్రవరి 17న ప్రవేశపరీక్ష జరుగుతుందని ఆమె తెలిపారు.

2245
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles