ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సుకు దరఖాస్తులు

Sat,January 19, 2019 07:29 AM

Applications for Pre primary teacher training Course

ఉస్మానియా యూనివర్సిటీ : దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్) (పాత ఆంధ్ర మహిళా సభ) ప్రాంగణంలోని ఎస్టీవీసీ కేంద్రం ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సుకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సులో చేరేందుకు కనీసం పదవ తరగతి పాసై ఉండాలని, ఎటువంటి వయోపరిమితి లేదని చెప్పారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వ సర్టిఫికెట్ అందజేయనున్నట్లు వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 25వ తేదీలోగా దాఖలు చేయాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 9397824542 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

3195
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles