స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు

Thu,May 16, 2019 06:47 AM

applications for admission into telangana sports schools

శామీర్‌పేట: హకీంపేటలోని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని రీజినల్ స్పోర్ట్స్ స్కూళ్లలోప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఓఎస్డీ డాక్టర్ కే నర్సయ్య బుధవారం తెలిపారు. బాలురు, బాలికలు 20 మంది చొప్పున 2019-20 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశానికి ఎంపిక చేయనున్నారు. బాలబాలికలు 01-09-2010 నుంచి 31-08-2011 మధ్య పుట్టిన 8 సంవత్సరాల వయసువారై ఉండాలని తెలిపారు. జూన్ 19 లోపు ఎంఈవో ఆధ్వర్యంలో, జూన్ 26 నుంచి జూలై 3 వరకు డీవైఎస్వో ఆధ్వర్యంలో, జూల్ 11 నుంచి 20 వరకు రాష్ట్రస్థాయి ఎంపికను నిర్వహించి, ఆగస్టు మొదటివారంలో అడ్మిషన్లు ఇస్తామని తెలిపారు.
ప్రతిభ ఆధారంగా ఎంపిక
విద్యార్థుల ఎత్తు, బరువుతోపాటు, 30 మీట ర్ల ఫ్లయింగ్‌స్టార్ట్, స్టాండింగ్ బోర్డ్ జంప్, 800 మీటర్ల రన్నింగ్, 6-10 మీటర్ల షటిల్ రన్, మెడిసిన్ బాల్ ఫుట్, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారని, రాష్ట్రస్థాయి ఎంపికలు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట క్యాంపస్‌లో జోన్లవారీగా నిర్వహిస్తారని తెలిపారు.

2301
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles