డీడీఎంఎస్ లో పలు కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

Tue,April 16, 2019 06:34 AM

Application invites for Courses in  DDMS OU

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ మహిళా సభ (డీడీఎంఎస్‌) (పాత ఏఎంఎస్‌)లో పలు కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సులు విద్యార్థులు, నిరుద్యోగ యువత, మహిళలకు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.

ఎంఎస్‌ ఆఫీస్‌ అండ్‌ ఇంటర్నెట్‌, ట్యాలీ ఈఆర్‌పీ9, బ్యూటీషియన్‌ తదితర కోర్సులు, బేకింగ్‌ తరగతులు, స్పోకెన్‌ ఇంగ్లీష్‌, టైలరింగ్‌, జర్దోసి (మగ్గం వర్క్‌), జ్యూట్‌ బ్యాగ్‌ మేకింగ్‌, బ్రైడల్‌ ఆర్టిస్ట్‌, మెహందీ ఆర్టిస్ట్‌ తదితర కోర్సులకు ఈ నెల 28వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. చిన్నారులకు ప్రత్యేక వేసవి శిబిరానికి హాజరయ్యేందుకు ఈ నెల 20వ తేదీలోగా పేర్లు నమోదు చేయించుకోవాలని పేర్కొన్నారు. సీట్లు పరిమితమని, ముందు వచ్చిన వారికి ప్రథమ ప్రాధాన్యతన ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు 9951210441, 9398091395, 040-27098406 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

1195
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles