జాతీయ యువ కార్యకర్త దరఖాస్తుల ఆహ్వానం

Tue,April 10, 2018 12:25 PM

application for national youth volunteer

నెహ్రూ యువకేంద్రం, భారత యువజన వ్యవహారాల శాఖ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న యువకేంద్రంలో జాతీయ యువ కార్యకర్తలు (నేషనల్ యూత్ వాలంటీర్)గా పనిచేయుటకు గతంలో ఇచ్చిన ప్రకటనకు అనుబంధంగా దరఖాస్తులను వచ్చే నెల 31లోగా చేయాలని జిల్లా యువజన సమన్వయ అధికారి తెలిపారు. యువకేంద్రంలో కార్యకర్తగా పనిచేయడానికి ఉద్యోగంగా భావించకుండా స్వచ్ఛందసేవా మాత్రమే చేస్తామన్న భావనతో యువతీయువకులు గమనించాలన్నారు. అందుకోసం ఎంపికైన వారికి గౌరవ వేతనంగా రూ.5వేలను అందజేస్తుందన్నారు.

యువ కార్యకర్తలు ముఖ్యంగా యువజన సంఘాల స్థాపన, ఆరోగ్యం, అక్షరాస్యత, స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా లాంటి కార్యక్రమాలతో యువతను చైతన్యం చేయడమే వారి బాధ్యత ఉంటుందన్నారు. పదోతరగతి పాసై కంప్యూటర్‌పై అవగాహన కలిగి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కలిగి ఏప్రిల్ 1 నాటికి 18-29 సంవత్సరాల లోపు యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్ www.lyks.org ద్వారా మే 31లోగా పంపాలని సూచించారు. వివరాలకు 08457-222529, 9515102356 నెంబర్లను సంప్రదించాలన్నారు.

4062
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles