సిరిసిల్లలో అపరల్ సూపర్ హబ్

Tue,March 13, 2018 05:53 PM

Apparel Super Hub will be set in Siricilla

హైదరాబాద్: సిరిసిల్ల ప్రాంతంలో 20 ఎకరాల్లో అపరల్ సూపర్ హబ్ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం- కేఏవై వెంచర్స్ మధ్య అవగాహనా ఒప్పందాలు జరిగాయి. అనంతరం మంత్రి కేటీఆర్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో అపరల్ సూపర్ హబ్‌ను రూ. 100 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 15 వేల మందికి, పరోక్షంగా మరో 15 వేల మందికి ఉపాధి లభించనున్నట్లు చెప్పారు. వస్త్ర రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీలను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. నేత కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. గత బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ. 1200 కోట్లు కేటాయించాం. 50 శాతానికి పైగా మరమగ్గాలు సిరిసిల్లలోనే ఉన్నయి. సూరత్, బివాండీకి వలసపోయిన నేతన్నలు తిరిగి స్వరాష్ర్టానికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నం. దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు తెలంగాణలో శ్రీకారం చుట్టాం. నూలు, రసాయనాల మీద 50 శాతం సబ్సిడీ ఇస్తున్నం. నేత కార్మికులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకుని అండగా ఉంటున్నం. నేతన్నలకు చేయూత పథకంతో సామాజిక భద్రత కల్పిస్తున్నం. నేతన్నలకు కష్టాలు లేకుండా చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. తిర్పూర్‌లో వస్త్ర ఉత్పత్తిపై అధ్యయనం చేశాం. తెలంగాణ టెక్స్‌టైల్స్, అపారెల్ విధానం తీసుకోచ్చాం. సిరిసిల్ల రూపురేఖలు మార్చేలా పరిశ్రమ వస్తోందన్నారు.

2053
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles