ఆపద ఎక్కడ ఉంటే హరీష్‌ అక్కడుంటాడు : ఏపీ నేతలు

Thu,May 11, 2017 10:49 AM

AP leaders praises Minister Harish Rao

ప్రజల మనిషిగా పేరొందిన మంత్రి హరీష్‌రావును ఆంధ్రప్రదేశ్ నాయకులు కొనియాడారు. ఎవరైనా ఆపదలో ఉంటే తక్షణమే స్పందించి ఆదుకునే గుణమున్న హరీష్‌రావుపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం హరీష్‌కు కొత్తేమీ కాదని.. ఆపద ఎక్కడ ఉంటే ఆయన అక్కడుంటాడని ఏపీ నేతలు అన్నారు.

ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మరణ వార్త తెలుసుకున్న హరీష్‌రావు హుటాహుటిన అపోలో ఆస్పత్రికి చేరుకుని నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిశిత్ కుటంబ సభ్యులను ఓదార్చిన హరీష్.. ఉస్మానియా ఆస్పత్రి నుంచి ఫోరెన్సిక్ వైద్య నిపుణులను అపోలోకు రప్పించి అక్కడే పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

ఇక నిశిత్, రాజా రవివర్మ మృతదేహాలను వారి స్వస్థలాలకు హెలికాప్టర్‌లో పంపేందుకు ఏవియేషన్ అధికారులతో చర్చించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో నిశిత్ మృతదేహాన్ని రోడ్డుమార్గంలో అంబులెన్స్‌లో నెల్లూరుకు తరలించారు. రాజా రవివర్మ మృతదేహాన్ని కూడా ప్రకాశం జిల్లాకు పంపేందుకు చొరవ తీసుకన్నారు హరీష్. తెల్లవారుజామునే అపోలోకు చేరుకుని.. నిశిత్ కుటుంబ సభ్యులకు అండగా నిలిచి.. నిశిత్, రవివర్మ మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపే వరకు హరీష్‌రావు తీసుకున్న చొరవను ఏపీ నేతలు కొనియాడారు.

నిశిత్ నారాయణ విషయంలోనే కాదు. ఇటీవలే సిద్ధిపేటకు చెందిన మహిళకు రెండు కిడ్నీలు పాడైపోతే.. హరీష్‌రావు దగ్గరుండి నిమ్స్‌లో చేర్పించి చికిత్స చేయించారు. బాధిత మహిళకు రూ. 50 వేలు ఆర్థికసాయం చేశారు. 2014లో మాసాయిపేట రైలు ప్రమాదం జరిగినప్పుడు చివరి మృతదేహానికి పోస్టుమార్టం జరిపించే వరకూ అక్కడే ఉండి బాధిత కుటుంబాలకు సాయపడ్డారని పలువురు గుర్తు చేసుకున్నారు.

8188
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles