కరీంనగర్ జిల్లాకు మరో జాతీయ అవార్డు..

Sat,January 12, 2019 09:55 PM

Another National Award for Karimnagar District

కరీంనగర్ : కరీంనగర్ జిల్లాకు మరో జాతీయ స్థాయి అవార్డు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ బచావో- బేటీ పడావో పథకాన్ని జిల్లాలో విజయవంతంగా, స్ఫూర్తిదాయకంగా అమలు చేస్తున్నందుకు ఎఫెక్టివ్ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డును అందుకుంటున్న దేశంలోని 24 జిల్లాల్లో మన జిల్లా ఉంది. ఇప్పటికే పలు అవార్డులు అందుకుని జాతీయ స్థాయిలో గుర్తుంపు తెచ్చిన కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఈ నెల 24న మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని ప్రవాసీ భారతీయ కేంద్రంలో జరిగే జాతీయ బాలికల దినోత్సవంలో ఈ అవార్డును అందుకోబోతున్నారు. రాష్ట్రంలోని మూడు జిల్లాలతో పోటీ పడిన కరీంనగర్ జిల్లాకు ఈ అవార్డు వచ్చినందుకు కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను అభినందిస్తూ ఆహ్వానం పలికారు. బేటీ బచావో- బేటీ పడావో పథకం జిల్లాలో విజయవంతంగా నిర్వహిస్తున్న కలెక్టర్‌కు అవార్డు రావడం పట్ల పలు శాఖల అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

762
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles