ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునే వారికి మరో ఛాన్స్..

Fri,March 1, 2019 07:36 AM

Another chance to Voter registration in Rangareddy

రంగారెడ్డి జిల్లా : రానున్న పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా సిద్ధం చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవలే ఓటు నమోదుకు తుది గడువు ముగియగా... తాజాగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అధికారులు మరో అవకాశం కల్పించారు. అలాగే మొన్నటి శాసనసభ ఎన్నికలలో చోటుచేసుకున్న పొరపాట్లు సరిదిద్దుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. మార్చి 2 నుంచి 3వరకు జిల్లాలో ఓటరు నమోదుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు రోజులు పోలింగ్‌ కేంద్రాల్లో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు.

సరి చేసుకోండి..


మార్చి 2, 3వ తేదీల్లో పోలింగ్‌ కేంద్రాల్లో జాబితాతో పాటు అన్ని రకాల దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. అప్పటికప్పుడు దరఖాస్తు చేసుకోవాలి. తప్పులుంటే సరిచేసుకునే వెసులుబాటు ఉంది. చిరునామాలో మార్పులు చేసుకోవచ్చు. అలాగే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఓటరు హెల్ప్‌లైన్లకు ఫోన్‌ చేసి పేరు ఉందా..? లేదా..? తెలుసుకునేందుకు వీలున్నది.

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం సీఈఓ.తెలంగాణ.ఎన్‌ఐసీ.ఇన్‌ వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు. ఈ తేదీలలో బీఎల్‌ఓల ద్వారా ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు ఓటు హక్కు ఉన్నది లేనిది తెలుసుకోవడానికి టోల్‌ ఫ్రీ నంబర్‌ 1950 కూడా ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే 10 రోజుల ముందు వరకు కూడా ఓటరు నమోదు చేసుకున్న అందరికీ ఓటు హక్కును కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

3290
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles