ఓటుహక్కు నమోదుకు మరో అవకాశం

Fri,March 11, 2016 04:50 PM

another chance to Voter registration

హైదరాబాద్ : వయోజనులు ఓటుహక్కు దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం వచ్చింది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూ ల్ ప్రకారం ఈరోజు తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. మే 31కి తుదిజాబితా ప్రదర్శనను చేపట్టనున్నట్లు ఎన్నికల విభాగం అధికారులకు లిఖిత పూర్వక సమాచారం అందింది. ఇప్పటికీ ఓటుహక్కు లేని వయోజనులు మరోమారు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునే సువర్ణావకాశం లభించినట్లయింది.

అతిత్వరలో ఎన్నికల సంఘం సైతం ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను సైతం వెల్లడించే అవకాశం ఉంది. నగరంలో ఇంకా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోని ఓటర్లుంటే మే మొదటివారం వరకూ ఇంటర్నెట్, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లభించనుంది. అధికారిక ప్రకటన అనంతరం దీనిపై అధికారులు సైతం విస్తృత ప్రచారం చేయాలని భావిస్తున్నారు.

1588
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles