ఫెయిల్ అయిన విద్యార్థులకు మరో ఛాన్స్

Mon,February 18, 2019 06:15 AM

Another chance for students who fail degree and PG

కాచిగూడ: నారాయణగూడ రెడ్డి మహిళా కళాశాలలో చదివిన డిగ్రీ 2007 నుంచి 2018 వరకు, పీజీ 2005 నుంచి 2018 విద్యా సంవత్సరం వరకు వివిధ కోర్సుల్లోని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మరోసారి పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు రెడ్డి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శారద, ఎగ్జామినేషన్ కంట్రోలర్ కె.స్వప్న తెలిపారు. డిగ్రీలో బీఏ,బీఎస్సీ. బి కాం, బిబిఎంటి కోర్సుల్లోని ఆయా సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు డిగ్రీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుని డిగ్రీ పూర్తి చేసుకోవచ్చని, అలాగే పీజీ విద్యార్థులు వివిధ పీజీ కోర్సులకు దరఖాస్తు చేసుకుని పీజీ పూర్తి చేసుకోవచ్చని వారు పేర్కొన్నారు. ఆయా సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు మార్చి 15వ తేదీ లోపు పూర్తిచేసి దరఖాస్తులను రెడ్డి మహిళా కళాశాలలో అందించాలని సూచించారు. మార్చి 23 నుంచి పరీక్షలు జరుగుతాయని వారు తెలిపారు. 040-27550271, 27567778లో సంప్రదింవచ్చని వెల్లడించారు.

6855
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles