సిటీనటితో అసభ్యప్రవర్తన కేసు..మరో ఇద్దరు అరెస్ట్‌

Thu,December 5, 2019 06:40 AM


మాదాపూర్‌ : మాదాపూర్‌ నోవాటెల్‌లోని ఆర్టిస్ట్రీ పబ్‌లో సినీనటితో అసభ్యకరంగా ప్రవర్తించిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత నందీశ్వర్‌గౌడ్‌ కుమారుడు ఆశిష్‌గౌడ్‌ కోసం మాదాపూర్‌ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆశిష్‌గౌడ్‌తో కలిసి పబ్‌లో హల్చల్‌ చేసి వీరంగం సృష్టిం చిన అతని స్నేహితులు ఇస్నాపూర్‌, మత్తంగి నివాసం ఉంటున్న సం కేత్‌గౌడ్‌ అలియాస్‌ బిన్ను (26), పోసాని పవన్‌కుమార్‌ గౌడ్‌ అలి యాస్‌ టిల్లు (25)లను పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడి కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ క్రమంలో బాధిత నటి పోలీస్‌ స్టేషన్‌కు విచ్చేసి కేసు విషయమై ఆరా తీసింది. పబ్‌లో జరిగిందంత సీసీ ఫుటేజీలో ఉందని, పోలీసులు ఫుటేజీలను పరిశీలించడంలో విఫలమవుతున్నారని అన్నది. నిందితుడు ఆశిష్‌గౌడ్‌ను అరెస్ట్‌ చేసి .. తనకు రక్షణ కల్పించాలని సినీనటి కోరింది.

1025
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles