ఖమ్మం జిల్లాలో ఆంధ్రాకు చెందిన ప్రేమజంట ఆత్మహత్య

Wed,September 19, 2018 10:09 PM

andhra love couple commit suicide in khammam district

ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా తిరువూరు గ్రామానికి చెందిన ఓ యువతి, పెండ్లయిన ఓ వ్యక్తి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రీశ్వరదేవాలయాన్ని సందర్శించి కూల్‌డ్రింక్‌లో గుళికలు కలుపుకుని తాగి మృతిచెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. తిరువూరు మండలం కోకిలంపాడుకు చెందని జొన్నలగడ్డ తిరుపతిరావు(23) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

అదే గ్రామంలో తిరుపతిరావు ఇంటి పక్కనే ఉన్న కొంగల శ్రీలక్ష్మీ (18) తిరుపతిరావు ఆటోలో రోజూ తిరువూరు కళాశాలకు వెళ్తూ ఇంటర్ పూర్తి చేసింది. తిరుపతిరావుకు గత ఐదేళ్ల క్రితమే వేరే గ్రామానికి చెందిన దీప్తితో వివాహం కాగా, వారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆటోలో రోజూ కళాశాలకు వెళ్లే శ్రీలక్ష్మీ, తిరుపతిరావు గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు.

కాగా తిరుపతిరావు, శ్రీలక్ష్మి గత నాలుగు రోజులుగా కనిపించకుండా పోవడంతో తిరుపతిరావు భార్య దీప్తి తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం కోకిలంపాడు గ్రామానికి చెందిన శివ అనే యువకుడికి తిరుపతిరావు ఫోన్ చేసి నీలాద్రి దేవాలయానికి వెళ్లాలి అని పిలువగా అతడు వెళ్లాడు. అనంతరం తిరుపతి, శ్రీలక్ష్మి, శివజజ ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం అక్కడే కూల్‌డ్రింక్‌లో తిరుపతిరావు, శ్రీలక్ష్మి గుళికలు కలుపుకుని తాగి తిరిగి ప్రయాణమయ్యారు. మార్గ మధ్యలో మండాలపాడు వద్ద రోడ్డుపై స్పృహతప్పి పడిపోయారు.

గమనించిన స్థానికులు వారిని పెనుబల్లి ఏరియా వైద్యశాలకు తరలించగా శ్రీలక్ష్మీ వెంటనే మృతి చెందింది. అనంతరం చికిత్స పొందుతూ తిరుపతిరావు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తిరుపతిరావు భార్య వైద్యశాలకు వచ్చి భర్త మృతదేహం పడి రోధిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. ఈ విషయం తెలుసుకున్న సీఐ మడత రమేష్, ఎస్‌ఐ తోట నాగరాజు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

5271
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS