కేసీఆర్ సభకు ఆంధ్రా అభిమానులు

Sun,March 17, 2019 06:38 PM

andhra fans attended cm kcr meeting in karimnagar

- ఇలాంటి నాయకుడిని ఎక్కడా చూడలేదు..
- విజయవాడకు చెందిన అభిమాని ఆదినారాయణ

కరీంనగర్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ నుంచి కొంత మంది సీఎం కేసీఆర్ అభిమానులు వచ్చారు. కేసీఆర్ సభ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్తున్నామని ఈ సందర్భంగా వారు వివరించారు. కేసీఆర్ అంటే తమకు ఎంతో అభిమానం ఉందనీ, ఇలాంటి నాయకుడు తమ రాష్ర్టానికి అవసరమని స్పష్టం చేశారు.

విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన కొనిజేటి ఆదినారాయణ అనే అభిమాని మాట్లాడుతూ.. కేసీఆర్ లాంటి నాయకుడు ఆంధ్రాకు అవసరమన్నారు. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి అద్భుతమైన ఫలితాలు రాబట్టారని తెలిపారు. ఆంధ్రా రాజకీయాల్లో కొందరు నాయకులు అభివృద్ధి చేయడం చేతకాక కేసీఆర్ వంటి మహానాయకుడిని బూచిగా చూపుతూ ఎన్నికలకు వెళ్తున్నారనీ, ఇది సిగ్గుచేటని ఆదినారాయణ మండిపడ్డారు. ఆంధ్రా తెలంగాణ మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయనీ, కరెంటు విషయంలో చార్జీలు రావాల్సి ఉందనీ, పోలవరం ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో, పులిచింతల నిధుల కేటాయింపులో సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవచ్చన్నారు. తెలంగాణకు రావాల్సిన అనేక నిధులు మీరు మాకు ఇవ్వాల్సిన పనిలేదు అని పెద్ద మనుసుతో కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.

ఆంధ్రా నాయకులు అభివృద్ధి చేయలేక ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కేసీఆర్‌ను బూచిగా చూపి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రా వ్యక్తిని అయి ఉండి తెలంగాణలో కేసీఆర్ హాజరయ్యే ప్రతి సభకు హాజరవుతున్నాననీ, ఇలాంటి నాయకుడిని తానెక్కడా చూడలేదని ఆదినారాయణ స్పష్టం చేశారు. ఆంధ్రాలో అమలు చేస్తున్న పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నవేననీ, ఇక్కడి పథకాలే అక్కడా కాపీ కొడుతున్నారని తెలిపారు. కేసీఆర్ లాంటి నాయకుడు తమకూ కావాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.

ఇంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో సారు.. కారు.. కేసీఆర్ నినాదంతో ముందుకు వెళ్లి బ్రహ్మాండమైన విజయం సాధించారనీ, ఇపుడు సారు.. కారు.. పదహారు నినాదంతో పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేయబోతున్నారని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆంధ్రాలో జగన్‌తో దోబూచులాడుతున్నారని కొందరు నాయకులు ప్రచారం చేస్తున్నారనీ, అది వాస్తవం కాదని ఆది నారాయణ ఖండించారు. తెలంగాణలో 17, ఆంధ్రాలో 25 స్థానాలు కలిస్తే 42 సీట్లతో తెలుగు రాష్ర్టాలు అనుకున్నది సాధించవచ్చనేది కేసీఆర్ ఆలోచనని ఆయన స్పష్టం చేశారు. యావత్ భారతదేశం కేసీఆర్ వైపు చూస్తున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి ఆలోచన చాలా మంచిదనీ, కేసీఆర్ ఆలోచనను ఆంధ్రా నాయకులు కూడా గ్రహిస్తే మంచిదని ఆయన కోరుకున్నారు.

7349
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles