పురాతన రాతి విగ్రహం లభ్యం

Mon,June 17, 2019 09:39 PM

ancient stone venkateswara swamy statue identified

వర్ధన్నపేట : చెరువు పూడికమట్టిని తీస్తుండగా పురాతన వెంకటేశ్వరస్వామి రాతి విగ్రహం బయటపడిన ఘటన వరంగల్‌రూరల్‌జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతాపురంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కొద్ది రోజులుగా చెరవులో పేరుకుపోయిన పూడికమట్టిని రైతులు ట్రాక్టర్‌ల ద్వారా పంటపొలాలకు తరలిస్తున్నారు. ఈక్రమంలోనే జేసీబీతో పూడికమట్టిని తీస్తున్న సమయంలో విగ్రహం మిషన్‌కు తగలింది. దీంతో డ్రైవర్ విగ్రహంగా గుర్తించి నెమ్మదిగా విగ్రహాన్ని బయటకు తీశాడు. ట్రాక్టర్ డ్రైవర్లు, రైతులు విగ్రహాన్ని పరిశీలించడంతో వెంకటేశ్వరస్వామి విగ్రహంగా గుర్తించారు. ఈ విషయం గ్రామంలో దావానంలా వ్యాపించడంతో గ్రామస్తులు, మహిళలు చెరువు వద్దకు చేరుకుని విగ్రహాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. అత్యంత పురాతనమైన రాతి విగ్రహం కావడంతో గ్రామంలోని దేవాలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని పలువురు గ్రామస్తులు భావిస్తున్నారు.

2642
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles