పాపం ఐదు ఓట్ల తేడాతో ఓడిన ఆనంద్‌కుమార్‌గౌడ్

Sat,February 6, 2016 01:07 PM

Anand kumar goud lost with 5 votes in GHMC elections

అబిడ్స్ : జాంబాగ్ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఎం ఆనంద్‌కుమార్ గౌడ్ గెలుపు అంచు వరకు పోయి చివరకు కేవలం ఐదు ఓట్ల తేడాతో ఓటమిని చవి చూశారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులు తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. ప్రకటించిన జీహెచ్‌ఎంసీ ఫలితాల్లో ఆయన ఓటమి నగరమంతా చర్చనీయాంశంగా మారింది. 2009 ఎన్నికల్లో టీడీపీ పక్షాన అప్పటి సుల్తాన్‌బజార్ డివిజన్ నుంచి బరిలోకి దిగిన ఆయన అప్పుడు కూడా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
కాగా ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరపున జాంబాగ్ డివిజన్ నుంచి రంగంలోకి దిగిన ఆయన డివిజన్ పరిధిలో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేపట్టి ప్రభుత్వ పథకాల పట్ల ప్రచారం కల్పించారు. మైనార్టీ ఓట్లు ఫలితాన్ని శాసించే స్థాయిలో ఉన్న జాంబాగ్‌లో బలమైన ఎంఐఎంతో అభ్యర్థితో తలపడ్డారు. అందరి అంచనాలకు తగ్గట్లుగా గానే ఆయనకు గణనీయంగా ఓట్లు పోలయ్యాయి. గెలుపు ఖాయమనుకుంటున్న చివరి రౌండ్‌లో ఆయన ఎంఐఎం అభ్యర్థి చేతిలో కేవలం ఐదు ఓట్ల తేడాతో ఓటమిని చవి చూశారు. దీంతో ఆయనతో పాటు టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు.

మొదటి రౌండ్ నుంచి ఉత్కంఠ..


జాంబాగ్ డివిజన్‌లో పోలైన ఓట్లను ఐదు రౌండ్‌లలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొదటి రౌండ్‌లో ఊహించని విధంగా ఆనంద్‌కుమార్ గౌడ్ 1590 ఓట్లు పోలు కావడం, రెండో రౌండ్‌లో 1496 ఓట్లు లభించాయి. మూడో రౌండ్ నుంచి ఆయన ఓట్లు పెరిగాయి. నాలగవ రౌండ్‌లో మరింత అధికంగా ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆనంద్‌గౌడ్ మజ్లిస్ పార్టీ అభ్యర్థి డి. మోహన్‌పై విజయం వైపు పయనించారు. చివరి రౌండ్‌లో కూడా ఆయనకు ఓట్లు అధికంగా వచ్చిన మజ్లిస్ పార్టీ అభ్యర్థికి కూడా ఆ రౌండ్‌లో ఓట్లు రావడంతో ఐదు ఓట్ల వెనకంజలో నిలిచి పోయారు. మొదటి రౌండ్ నుంచి ఉత్కంఠ కొనసాగింది. చివరి రౌండ్ వరకు ఈ ఉత్కంఠ కొనసాగగా ఆనంద్‌గౌడ్ రీ కౌంటింగ్ చేయాలని అధికారులను కోరారు.

4933
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles