రైలు నుంచి పడి గుర్తుతెలియని యువతి మృతి

Mon,June 17, 2019 09:44 PM

An unidentified woman died falling from train

స్టేషన్‌ఘన్‌పూర్‌ : జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్-రఘునాథపల్లి రైల్వే స్టేషన్ల మధ్యలో సాయంత్రం ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ఓ గుర్తు తెలియని యువతి ప్రమాదవశాత్తు జారిపడింది. వెంటనే గుర్తించిన ప్రయాణికులు చైను లాగి రైలును నిలిపివేశారు. తీవ్రంగా గాయపడిన యువతిని అదే రైలులో జనగామకు తరలిస్తూ 108కు సమాచారం అందించగా హుటాహుటిన రైల్వే స్టేషన్‌కు వాహనంతో సిబ్బంది చేరుకున్నారు. అక్కడి నుంచి గాయపడిన యువతిని జనగామ ఏరియా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. యువతికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని కాజీపేట జీఆర్పీ తెలిపారు. మృతురాలు సుమారు 20 సంవత్సరాల వరకు ఉంటుందని, ఆమె ఒంటిపై రెడ్‌కలర్ గౌను, బ్లూ కలర్ జీన్ పాయింట్ ఉన్నట్లు పేర్కొన్నారు. సంబంధీకులు ఎవరైనా వివరాలకు జనగామ రైల్వే పోలీసులను సంప్రదించాలని వారు తెలిపారు.

3467
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles