ఈ నెల 20 నుంచి అమీర్‌పేట - హైటెక్‌సిటీ మెట్రో సేవలు

Mon,March 18, 2019 06:38 PM

ameerpet to hitech city metro rail start from 20th march 2019

హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో సేవలు ఈ నెల 20 నుంచి అమీర్‌పేట - హైటెక్‌సిటీ మధ్య ప్రారంభం కానున్నాయి. అమీర్‌పేట-హైటెక్‌సిటీ మార్గంలో మెట్రోరైలు కోసం ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. మాదాపూర్, హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఇతర సంస్థల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. వీరు రోజూ తమ కార్యాలయాలకు వచ్చివెళ్లేందుకు ట్రాఫిక్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అమీర్‌పేట్-హైటెక్‌సిటీ మార్గం లో రైళ్లు ప్రారంభమైతే ప్రజలకు వేగమైన, సౌకర్యవంతమైన ప్రయా ణం అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులో ఇప్పటికే మియాపూర్ -ఎల్బీనగర్ (29 కి.మీ), నాగోల్-అమీర్‌పేట (17కి.మీ.) మార్గం ప్రయాణికులకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.

అమీర్‌పేట-హైటెక్ సిటీ మార్గంలో మొత్తం ఎనిమిది స్టేషన్లు


-మధురానగర్(తరుణి)
-యూసుఫ్‌గూడ
-జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్-5
-జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు
-పెద్దమ్మ గుడి
-మాదాపూర్
-దుర్గం చెరువు
-హైటెక్‌సిటీ

అమీర్‌పేట, హైటెక్‌సిటీ మధ్య 11 కిలోమీటర్లు కూడా అందుబాటులోకి రానుంది. మొదటి దశలో మిగిలిన జేబీఎస్, ఎంజీబీఎస్ మధ్య 10 కిమీల దూరం, ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మెట్రో రూట్ కోసం పనులు జరుగుతున్నాయి.

2101
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles