అంబేద్కర్ 125వ జయంతి ఘనంగా నిర్వహిస్తాం: సీఎం

Tue,March 29, 2016 06:49 PM

ambedker 125 birth day celebrations celebrates grandly cm kcr

హైదరాబాద్: డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇవాళ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ తర్వాత సభ్యులకు ధన్యావాదాలు తెలుపుతూ ఆయన ప్రసంగించారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న అంబేద్కర్ భవనం పాతబడిపోయిందని దానిని కూల్చి వేసి కొత్తగా బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. దీంతో దళిత విద్యార్థులకు ఎక్కువ ఉపయోగం కలుగుతుందని పేర్కొన్నారు. దీనిపై అధ్యయనం చేసి ఎస్సీ కమిషన్ ఛైర్మన్ నివేదిక ఇవ్వాలని అన్నారు.

1103
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles