అంబేద్కర్ ఆశయాలను సాధించాలి : హరీష్ రావు

Mon,May 15, 2017 02:50 PM

Ambedkar Statue unveiling by Harishrao

సిద్ధిపేట : రాయపోల్ మండలం పెద్ద ఆరేపల్లిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను సాధించాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉందన్నారు. విద్యతోనే సమాజాభివృద్ధి జరుగుతుందన్నారు. ఏడాదిలోనే సీఎం కేసీఆర్ 120 గురుకుల పాఠశాలలు ప్రారంభించారని తెలిపారు. కులమతాలకతీతంగా అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఉద్ఘాటించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తేనే రైతుల ఆత్మహత్యలు ఆగుతాయని చెప్పారు. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.

674
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles