వరంగల్, నల్లగొండ జిల్లాల్లో అమెజాన్ ఈజీ స్టోర్లు

Tue,August 28, 2018 10:25 PM

Amazon Easy stores in Warangal and Nalgonda districts

హైదరాబాద్ : ఆన్‌లైన్, మొబైల్ యాప్‌ల ద్వారా వివిధకారణాలతో కొనుగోలు చేయలేని వినియోగదారుల సౌకర్యం కోసం అమెజాన్ ఈజీ పేరిట తెలుగు రాష్ర్టాల్లో 200 స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు అమెజాన్ తెలిపింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా దేశవ్యాప్తంగా 14 వేలు, తెలుగు రాష్ర్టాల్లో 1200 స్టోర్స్‌ను ప్రాజెక్ట్ ఉడాన్ కింద ఏర్పాటు చేశామని వాటిలో తొలి దశ కింద తెలంగాణాలోని వరంగల్, నల్లగొండ, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణ జిల్లాల్లో 200 స్టోర్స్‌ను అమెజాన్ ఈజీ స్టోర్స్ బ్రాండ్‌తో దీపావళికి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. మొబైల్, మెడికల్, కిరణా వంటి అన్ని రకాల రిటైల్ స్టోర్స్‌లో ఏ అమెజాన్ ఈజీ కియోస్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు అమెజాన్ మార్కెటింగ్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ డైరెక్టర్ తోట కిషోర్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ, డెస్క్‌టాప్, పెద్దటీవీ అనుసంధానం చేసి ఉండే ఈ కియోస్క్‌లో షాపింగ్ ను చేయవచ్చనని తెలిపారు.

అధునిక టెక్నాలజీతో పరిచయం లేని వారు కూడా ఈ స్టోర్స్ తమకు కావాల్సిన వస్తువులను అన్‌లైన్‌లోనే అర్డర్ చేయవచ్చునని తెలిపారు. డెలివరీ, పోస్ట్ సేల్స్ సేవలు కూడా ఈజీ స్టోర్స్ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు కాగా, స్టోర్స్ నిర్వహించే వారికి అమెజాన్ పూర్తి స్థాయి శిక్షణను కల్పించినట్టు తెలిపారు. వచ్చే ఏడాది ద్వితీయార్థానికి దేశంలో మొత్తం 14వేల ఔట్‌లెట్లను అమెజాన్ ఈజీ స్టోర్స్‌గా మార్చనున్నట్టు తెలిపారు. పది కోట్ల మంది అమెజాన్ ఈ కామర్స్ వినియోగదారులున్నారని తెలిపారు. త్వరలో అమెజాన్ మైక్రాన్ పేరుతో కొత్త యాప్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. అమెజాన్ ఈజీ భారతీయ వినియోగదారుల అలవాట్లకు తగ్గట్టుగా ఇండియాలోనే ప్రారంభించినట్టు కిశోర్ తెలిపారు.

1988
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS