సూర్యపేట ఎస్వీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Tue,January 29, 2019 06:34 PM

alumni meet of suryapet sv degree college students

సూర్యపేట: వచ్చే నెల 3 న సూర్యపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరపాలని పూర్వ విద్యార్థుల సంఘం నిర్ణయించింది. ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులందరూ ఆహ్హనితులేనని నిర్వహకులు ప్రకటించారు.

1971 నుండి 2018 వరకు చఫువుకున్న పూర్వవిద్యార్థులు అందరూ ఈ సమ్మేళనంలో పాల్గొనేలా అహ్హనం పంపాలని ఆ సంఘం ప్రతినిధులు తీర్మానించారు. ఈ మేరకు హైదరాబాద్ లోని ఎస్వీ కళాశాల పూర్వ విద్యార్థి, సూర్యపేట శాసనసభ్యుడు మాజీమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నివాస గృహంలో పూర్వ విద్యార్థుల సమ్మేలానానికి సంబంధించిన కరపత్రాన్ని మాజీమంత్రి, శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు.

పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షులు కర్నాటి కిషన్ ఆధ్వర్యంలో ఆ కళాశాలకు విద్యార్థి సంఘం అధ్యక్షులుగా పనిచేసిన నంద్యాల దయాకర్ రెడ్డి , బండారు దనుంజయ గౌడ్, మారం శెట్టి వీరయ్య, పసుపులేటి వేణు, ఉప్పు సత్యనారాయణలతో పాటు రంగరాజు రుక్మారావు, బోనగిరి సతీష్, వడ్డాణం శ్రీను, డి.యస్.వి శర్మ తదితరులు ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం మాజీమంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సూర్యపేట ఎస్వీ కళాశాలకు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని, అటువంటి కళాశాలలో నేను పూర్వ విద్యార్ధినని చెప్పుకునేందుకు ఒకింత గర్వాంగ ఉందన్నారు.అటువంటి కళాశాల లో విద్యనభ్య సించిన పూర్వ విద్యార్థులతో సమ్మేళనం ఏర్పాటు చేయడం అభినందనియమన్నారు.

అయితే ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థుల లో మెజారిటీ విద్యార్థులు ఎల్ . బి నగర్ , ఉప్పల్ తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డారని వారందరికీ ఆహ్వానం పంపాలని ఆయన సూచించారు. ప్రత్యేకించి ఈ కళాశాలలో విద్యను బోధించిన గురువులకు సన్మానంతో పాటు ఇక్కడ చదువుకుని ఉన్నత స్థానానికి ఎదిగిన వారందరినీ అభినందించడం ఈ సమ్మేళనం ముఖ్య ఉద్దేశ్యంగా ఉండాలని ఆయన సూచించారు.

1012
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles